Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

Advertiesment
cooking oil

ఠాగూర్

, సోమవారం, 6 జనవరి 2025 (10:12 IST)
అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కీలక సమాచారాన్ని వెల్లడించారు. గృహాలు, హోటళ్ళలో వాడే సన్ ఫ్లవర్ ఆయిల్, ద్రాక్ష గింజల నూనె, కనోలా, మొక్కజొన్న నూనెలతో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయాన్ని డాక్టర్ వివేక్ మూర్తి వెల్లడించారు. 
 
ముఖ్యంగా, యువకుల్లో పెద్దపేగు తరహా కేన్సర్ పెరుగుదలకు ఈ వంట నూనెలే కారణమని అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా 30 నుంచి 85 ఏళ్ల మధ్య వయసున్న 80 మంది పెద్దపేగు కేన్సర్ రోగుల కణతులను పరిశీలించిప్పుడు ఈ విషయం అర్థమైనట్టు చెప్పారు. వాటిలో బయోయాక్టివ్ లిపిడ్లు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు గుర్తించామన్నారు. విత్తనాల నుంచి వచ్చే నూనెల వాడకం వల్ల ఇవి పెరుగుతున్నాయని వివేక్ మూర్తి వివరించారు.
 
అలాగే, మద్యంతో ఏడు రకాల కేన్సర్లు పొంచి ఉన్నాయని వివేక్ మూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం బాటిళ్లపై హెచ్చరికలతో కూడిన లేబుళ్లు వేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అమెరికా కాంగ్రెస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పొగాకు, ఊబకాయం తర్వాత కేన్సర్‌కు మూడో అతి పెద్ద కారణం మద్యమేనని స్పష్టం చేశారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల రొమ్ము, కాలేయం, పెద్దపేగు, అన్నవాహిక, గొంతు సహా ఏడు రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఇది నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే