Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

crow

సెల్వి

, సోమవారం, 30 డిశెంబరు 2024 (13:02 IST)
ప్రపంచంలోని అన్ని జీవులు భగవంతునిచే సృష్టించబడినప్పటికీ, ప్రతి జీవికి దాని సొంత వ్యక్తిగత లక్షణాలు ఉన్నాయి. పిచ్చుకలు, పక్షులు వంటి ఎన్నో జీవులు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంటాయి. ఇలాంటి జీవులు మన ఇంటికి వస్తే శుభసూచకమా? చెడు శకునమా? అదేంటో చూద్దాం.
 
కాకి
కాకి ముఖ్యమైన పక్షులలో ఒకటి. ఇది శనీశ్వరుని వాహనం అని అందరికీ తెలిసిన విషయమే. అమావాస్య రోజుల్లో అందరూ కాకికి అన్నం పెట్టిన తర్వాతే తినాలి. రోజూ ఇలా చేస్తే మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. కాకికి డాబా మీద.. బాల్కనీ వెలుపల అన్నం పెట్టవచ్చు. అయితే ఇంట్లోకి కాకి వస్తే మంచిది కాదని అంటున్నారు.
 
గబ్బిలాలు
గబ్బిలాలు ఇంట్లోకి రాకూడదు. ఇవి వస్తే ఇంట్లో డబ్బు సమస్యలు కూడా ఉండవచ్చు. గబ్బిలం రక్తపు గాయంతో ఇంటికి వచ్చి పడిపోతే, ఏదో చెడు జరగబోతోందని అర్థం.
 
డేగ ఇంటిలోపలకు వస్తే మంచిది. సాధారణంగా ఇంట్లోకి రాకపోయినా, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో రాబందు చాలా ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇది మంచిది కాదు. రాబందు ఇంట్లోకి వస్తే సమస్యలు పెరుగుతాయి. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తాయి.
 
పిచ్చుకలు
పిచ్చుక ఇంట్లోకి వస్తే తరిమికొట్టకండి. ఎందుకంటే పిచ్చుకలు ఎప్పుడూ ఇంట్లోకి రావు. చాలా అరుదుగా పిచ్చుక ఇంట్లోకి వస్తాయి. అలాంటి పిచ్చుక మీ ఇంట్లోకి ప్రవేశిస్తే దాన్ని తరిమి కొట్టకూడదు. ఇది అదృష్టాన్ని తెచ్చే శుభ శకునంగా పరిగణించబడుతుంది. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే సంపద పెరుగుతుందని నమ్ముతారు.
 
గుడ్లగూబ:
గుడ్లగూబ రూపం చూసి చాలామంది దానిని ఇష్టపడరు. అయితే గుడ్లగూబ మహాలక్ష్మి వాహనం. ఉత్తరాది రాష్ట్రాల్లో, అదృష్ట లక్ష్మికి గుడ్లగూబ వాహనంగా ఉంది. కాబట్టి గుడ్లగూబ ఇంట్లోకి రాకపోవడం మంచిది. బాల్కనీలోకి వచ్చినా, ఇంట్లోకి వచ్చినా మంచిది కాదు. ఇంట్లో కుటుంబ అభివృద్ధిలో సమస్యలు ఉండవచ్చు.
 
పావురం:
ఇంటికి పావురం రావడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు. కాబట్టి పావురాలకు ధాన్యం ఇవ్వడం, నీరు పెట్టడం మొదలైన వాటి ద్వారా మనకు శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. పావురాన్ని మహా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. పావురం ఇంట్లోకి ప్రవేశించినా, గూడు కట్టుకున్నా ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అదే విధంగా బంగారు వర్ణంలోని ఈగ, కందిరీగ, చిలుక మొదలైనవి ఇంట్లోకి ప్రవేశిస్తే శుభసూచకంగా భావిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...