Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి ముద్దుపేరు పెట్టిన చైనీయులు...

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (16:47 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చైనీయులు ఓ ముద్దుపేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా మోడీకి మంచి ఆదరణ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, చైనాలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో ప్రధాని మోడీకి చైనీయులు మోడీ లాక్షియన్ అనే పేరు పెట్టారు. 
 
మోడీ నాయకత్వంలో భారత్, అగ్రదేశాలతో దౌత్య సంబంధాల విషయంలో సమతూకం పాటిస్తుందని చైనా జర్నలిస్టు ము షుంసాన్ అందులో పేర్కొన్నారు. చైనా నెటిజన్లు భారత ప్రధానిని మోడీ లాక్షియన్ అని పిలుచుకుంటున్నారని తెలిపారు. అంటే అసాధారణ ప్రజ్ఞ ఉన్న వృద్ధుడైన దివ్య పురుషుడు అని అర్థం. మోడీ వస్త్ర ధారణతో పాటు రూపం కూడా భిన్నంగా ఉంటాయని, ఆయన విధానాలు గత నేతల కంటే విభిన్నంగా ఉన్నాయని చెప్పారు. 
 
అందుకే చైనా ప్రజల్లో మోడీకి ఓ అసాధారణ స్థానముందని ఆయన చెప్పారు. చైనా ప్రజలు ఓ విదేశీ నేతకు ముద్దుపేరు పెట్టడం ఎపుడూ చూడలేదని చెప్పారు. చైనా సోషల్ మీడియా వేదికైన సైనా వీబోలో మోడీ 2015లో చేరినట్టు చెప్పారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారని, అయితే, 2020లో చైనా యాప్‌లపై భారత్ విధించిన నిషేధం కారణంగా ప్రధాని మోడీ ఖాతాను మూసివేశారని చైనా జర్నలిస్టులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments