Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ స్నేక్ కింగ్ తో పాటు 10 సినిమాలు నేనే రిలీజ్ చేస్తున్నా : ఏలూరు సురేంద్ర రెడ్డి

Advertiesment
big snake
, సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:22 IST)
big snake
ఏలూరు సురేంద్ర రెడ్డి సమర్పణలో బుద్ధ భగవాన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వస్తున్న సినిమా బిగ్ స్నేక్ కింగ్. ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఏలూరు సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ .. ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 3న అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. తెలుగులో నేను రిలీజ్ చేస్తున్నాను.

కథ విషయానికి వస్తే.. చైనా లోని ఒక గ్రామానికి చెందిన లీ.. కొంతమంది గ్రామస్థులను అక్రమ తవ్వకాల కోసం ఒక గుహ దగ్గరకు తీసుకెళ్తాడు. అయితే వారి కారణంగా వందేళ్లు గా నిద్రపోతున్న అతి పెద్ద పాము నిద్ర లేస్తుంది. దీని నుండీ తప్పించుకునే సమయంలో లీ మాత్రమే బ్రతికి బయటపడతాడు. కొన్ని రోజుల తర్వాత దానిని తరిమి కొట్టడానికి గ్రామస్థులు యాగాలు చేయడం ప్రారంభిస్తారు. మహారాజు కుమారుడు చింగ్ చాంగ్ వచ్చి ఆ గ్రామానికి సాయం చేస్తాడు. లీ కుమార్తె మింగ్ యు అతనితో కలిసి గ్రామస్థులను దూరంగా పంపి ఆ పెద్ద పామును డైనమైట్ బాంబ్ తో పేల్చి చంపేస్తారు. చివరిగా భూమి పై ఏ ప్రాణికి హాని చేయకూడదని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేస్తారు.
 
ఈ సిరీస్ లో వాళ్ళు దాదాపు 10 సినిమాలు చేశారు. అవన్నీ కూడా నేనే నెలకి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తున్నాను.ఫైట్ మాస్టర్ యువన్ హిందీలో దాదాపు 5 సినిమాలు చేశాడు. తెలుగులో ఒక సినిమా చేశాడు. హీరో లు లికస్ అనే అతను దాదాపు 100 సినిమాలు పైనే  చేశాడు. మార్చి 3 న తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేక్షకులే దేవుళ్ళు అనేది ఒట్టిమాటనేనా!