Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు ఓ స్టుపిడ్... ఉన్నాడని నిరూపిస్తే రాజీనామా : ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్

దేవుడు ఓ స్టుపిడ్ అంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూరెట్టి తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఉన్నాడనీ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించార

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (13:19 IST)
దేవుడు ఓ స్టుపిడ్ అంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూరెట్టి తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ఉన్నాడనీ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు.
 
అసలు చర్చిలకు ఎందుకు వెళ్తారు.. ప్రజలు దేవుడిని ఎందుకు నమ్ముతారు అంటూ డ్యుటెర్టి ప్రశ్నించారు. దేవుడు లేడు అని బలంగా నమ్మే ఆయన.. ఈ వ్యాఖ్యల తర్వాత ఓ సవాలు విసిరారు. అసలు దేవుడు ఉన్నాడని ఎలా అంటారు? ఒక్కరైనా దేవుడిని చూసిన వాళ్లు ఉన్నారా? ఎవరైనా దేవుడితో మాట్లాడటం, లేదా ఆయనతో సెల్ఫీ దిగడం లేదా దేవుడిని చూడటం, మాట్లాడటం చేశారా అంటూ డ్యుటెర్టి ప్రశ్నించారు. 
 
ఆయన వ్యాఖ్యలపై ప్రపంచం నలుమూలల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌కే చెందిన ఓ కేథలిక్ బిషప్ మాట్లాడుతూ.. డ్యుటెర్టి ఓ సైకో అని అన్నారు. కానీ ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొన్న ఆయన.. సహజంగానే వీటిని కూడా లైట్ తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments