కిమ్‌తో భేటీ సానుకూలం.. అణు భయం లేదు.. హాయిగా నిద్రపోవచ్చు: ట్రంప్
ఉత్తర కొరియాతో మనకు ఎలాంటి అణు భయం ఉండదని.. కిమ్ జాంగ్ ఉన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా, సానుకూలంగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
ఉత్తర కొరియాతో మనకు ఎలాంటి అణు భయం ఉండదని.. కిమ్ జాంగ్ ఉన్‌తో భేటీ చాలా ఆసక్తికరంగా, సానుకూలంగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సింగపూర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ల భేటీ జరిగిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం తన దేశానికి చేరుకున్న ట్రంప్.. ట్విట్టర్లో స్పందించారు.
లాంగ్ ట్రిప్ ముగించుకుని ఇప్పుడే అమెరికాకు చేరుకున్నానని చెప్పారు. దేశాధ్యక్షుడిగా తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత సురక్షితంగా ఫీలయ్యారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా సురక్షితంగా ఫీలవుతున్నారు. ఇకపై ఉత్తర కొరియాతో ఎలాంటి అణు భయం వుండదని చెప్పారు.
తాను అధ్యక్ష పదవి చేపట్టక ముందు చాలామంది మనం ఉత్తర కొరియాతో యుద్ధం చేయబోతున్నామన్న భావనలో ఉన్నారని.. నార్త్ కొరియానే మనకు అతిపెద్ద, ప్రమాదకర సమస్యని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తెలిపారు. కానీ ఇక అది ఏమాత్రం సమస్య కాదు. ఇక హాయిగా నిద్రపోవచ్చునని ట్రంప్ వ్యాఖ్యానించారు.