Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలవంతంగా మహిళతో లిప్ కిస్ పెట్టించుకున్న డ్యుటెర్టి... (వీడియో)

రొడ్రిగో డ్యటెర్టి.. ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి శభాష్ అనిపించుకున్నాడు. అదేసమయంలో తాజాగా ఓ మహిళతో బలవంతంగా లిప్ కిస్ పెట్టించుకుని విమర్శలపాలయ్యాడు.

Advertiesment
బలవంతంగా మహిళతో లిప్ కిస్ పెట్టించుకున్న డ్యుటెర్టి... (వీడియో)
, సోమవారం, 4 జూన్ 2018 (15:54 IST)
రొడ్రిగో డ్యటెర్టి.. ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు. డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపి శభాష్ అనిపించుకున్నాడు. అదేసమయంలో తాజాగా ఓ మహిళతో బలవంతంగా లిప్ కిస్ పెట్టించుకుని విమర్శలపాలయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఇటీవల దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వెళ్లిన డ్యుటెర్టి. అక్కడ ఫిలిప్పీన్స్ సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. సభకు అనేక మంది హాజరయ్యారు. అయితే స్టేజ్‌పై మాట్లాడుతూ అధ్యక్షుడు డ్యుటెర్టి ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకాన్ని అందజేసేందుకు ఇద్దరు మహిళల్ని స్టేజ్ మీదకు ఆహ్వానించగా, ఇద్దరు మహిళలు వేదికపైకి వచ్చారు. 
 
మొదటగా తన దగ్గర ఉన్న పుస్తకాన్ని అందజేసిన డ్యుటెర్టి.. ఒక మహిళను హగ్ చేసుకుని ఆమె చెంపపై ముద్దుపెట్టాడు. ఇక ఆ తర్వాత మరో మహిళను తనకు లిప్ కిస్ ఇవ్వాలని కోరారు. అధ్యక్షుడు లిప్ కిస్ అడుగుతుంటే.. ఆ మహిళ స్టేజ్‌పై తెగ సిగ్గుపడిపోయింది. ముద్దు పెట్టాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది. కానీ డ్యుటెర్టి మాత్రం పదేపదే తన చూపుడు వేలితో పెదవులను చూపిస్తూ.. లిప్ కిప్ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టాడు. 
 
చివరకు ఆమెను దగ్గర తీసుకుని.. ఆమె పెదవులపై ముద్దు పెట్టారు. ఆ ఘటన జరిగిప్పుడు అక్కడ సభలో ఉన్న వారంత కేరింతలు కొట్టారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అధ్యక్షుడి తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. డ్యుటెర్టి ప్రవర్తన.. మహిళల పట్ల సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత పడకగదిలోనే సీసీ కెమెరాలు అమర్చాడు.. ఎందుకో తెలుసా?