ఉత్తర కొరియాలో బాహుబలి క్షిపణి... సైనిక పరేడ్‌లో ప్రదర్శన

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (16:44 IST)
ఉత్తర కొరియా రక్షణశాఖ బాహుబలి క్షిపణిని తయారు చేసింది. దీన్ని శనివారం జరిగిన సైనిక పరేడ్‌లో ప్రదర్శించింది. ఆ దేశ అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించారు. ఇది ఖండాంతర అణుక్షిపణిగా భావిస్తున్నారు. దీని సైజు దృష్ట్యా అంతర్జాతీయ మీడియాలో రాక్షస క్షిపణి అని అభివర్ణిస్తున్నారు. 
 
కాగా ఓ పెరెడ్‌లో బహిరంగంగా ప్రదర్శించిన మిస్సైళ్లలో ఇదే అతిపెద్దది అని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య పేర్కొంది. ఈ బాహుబలి క్షిపణికి అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ సైనిక ప్రదర్శనకు ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న కూడా పెరేడ్‌లో పాల్గొన్నట్టు అక్కడి అధికారిక మీడియా ఓ వీడియో విడుదల చేసింది. భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా కిమ్ జాంగ్ ఉన్ అభివాదం చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajol Durga Puja 2025 viral video, నటి కాజోల్‌ను తాకరాని చోట తాకాడంటూ...

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments