ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సీరియస్ అయ్యారు. తనను ప్రశ్నించేవారికి ఉరిశిక్షే అంటూ మరోసారి హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాలుగు ప్రశ్నలు వేసిన ఐదుగురు అధికారులకు కిమ్ ఆదేశాల మేరకు శిరచ్ఛేదనం గావించారు. ఇటీవల జరిగిన ఒక డిన్నర్ పార్టీలో ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు దేశ ఆర్థిక వ్యవస్థపై దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చించారు.
దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అవసరమని వారు పేర్కొన్నారు. సమస్యలను అధిగమించడానికి ఉత్తర కొరియా కూడా విదేశీ సహాయం కోరాలని వారు సూచించారు. ఇదే సమయంలో కిమ్ పాలనా విధానాలను కూడా వారు విమర్శించారు. దాంతో ఆగ్రహానికి గురైన కిమ్.. తనను ప్రశ్నించిన ఐదుగురు అధికారులను కాల్చిచంపాలని సైన్యాన్ని ఆదేశించారు.
ఈ విషయాలను దక్షిణ కొరియా దినపత్రికలు వెల్లడించాయి. ఈ ఘటన జూలై 30 న జరిగినట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖకు కూడా అధిపతిగా ఉన్నకిమ్ జోంగ్ ఉన్.. ప్రతి ఒక్కరినీ పిలిపించి.. ఉత్తర కొరియా పాలనను బలహీనపరిచేందుకు ప్రయత్నించినట్లు ఒప్పుకునేలా వారిని బలవంతపెట్టారని దక్షిణ కొరియా దినపత్రికలు తెలిపాయి. జూలై 30 న వారిని కాల్చి చంపి వారి కుటుంబాలను యెడోక్‌లోని రాజకీయ శిబిరానికి తరలించారు.
అధికారాన్ని అందుకోవటానికి నియంత కిమ్ జోంగ్ ఉన్ తన సొంత అంకుల్ కిమ్ జోంగ్ థేక్‌ను 120 వేట కుక్కల బోనులో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. థేక్ మరణాన్ని ప్రశ్నించిన అతడి భార్య కూడా విషప్రయోగంతో చంపబడింది. మలేషియాలో తన సవతి సోదరుడిని హత్య చేశారు. మరో సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్‌ను కూడా మలేషియాలో హత్య చేయబడ్డారు. ఉత్తర కొరియాపై గూఢచర్యం చేసినట్లు నామ్‌పై ఆరోపణలు వచ్చాయి.