Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చిన మందులేంటి?

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (15:21 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారినపడిన తర్వాత అతి త్వరలో కోలుకున్నారు. ఇపుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆయన.. కేవలం నాలుగు రోజులు మాత్రమే అక్కడ ఉండి ఆ తర్వాత తిరిగి వచ్చేశారు. పైగా, వయసు తక్కువేమీ కాదు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 74 ట్రంప్‌ ఎంతో హుషారుగా కన్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
అమెరికా అధ్యక్షుడంటే మాటలా... భూమ్మీద ఇప్పటివరకూ ఎవ్వరికీ ఇవ్వనటువంటి కాంబినేషన్‌లో మందులు ఇచ్చి తొందరగా కోలుకునేలా చేశారు వైద్యులు. వ్యాధి సోకినట్టుగా నిర్ధారణకాగానే ట్రంప్‌కు రెండు యాంటీబాడీలను ఇచ్చారు. 
 
ఈ యాంటీబాడీలను సింగపూర్‌కు చెందిన ముగ్గురు పేషంట్ల రక్త నమూనాలతో రూపొందించారని ఆసియన్‌ సైటింస్ట్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. ఈ యాంటీబాడీ థెరపీని ఆర్‌ఈజీఎన్‌-సీఓవీ2గా పేర్కొంటారు. మిలిటరీ ఆస్పత్రిలో ఉన్న మూడు రోజులు యాంటీవైరల్‌ డ్రగ్స్‌, స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. 
 
వాటన్నిటి వల్లా ఆయన తొందరగా కోలుకున్నాడు. ఆర్‌ఈజీఎన్‌- సీఓవీ2ను వినియోగించడానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇంకా అనుమతి మంజూరు చేయలేదు. కానీ ట్రంప్‌ కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ ఈ మందులను వాడారట. వారి ప్రయత్నాలు ఫలించి ట్రంప్‌ కోలుకున్నాడు. ఫలితంగా ఆయన మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments