Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జాంగ్.. జపాన్ ప్రజలను ఎలా పరిగెత్తించేలా చేశాడో తెలుసా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, హోక్కైడో నగరాల్లో ఓ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ జపాన్ ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. అణు క్షిపణి వచ్చి పడనుందని.. అందరూ

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (12:29 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జపాన్ ప్రజలకు చుక్కలు చూపించారు. జపాన్‌లోని ఎరిమో, హోక్కైడో నగరాల్లో ఓ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ జపాన్ ప్రజలను పరుగులు తీసేలా చేశాయి. అణు క్షిపణి వచ్చి పడనుందని.. అందరూ ఇళ్లల్లోకి పారిపోండనే మాటలు విన్న జపాన్ ప్రజలు వణుకుతో పరుగులు తీశారు. 
 
ఉత్తర కొరియా శుక్రవారం మరో క్షిపణి పరీక్షను నిర్వహించి, దాన్ని జపాన్ మీదుగా వదిలింది. ఈ సందర్భంగా జపాన్ ప్రజలను అలా అలెర్ట్ చేశారు. క్షిపణి జపాన్ మీదుగా వెళుతూ ఉండటాన్ని ఆ దేశ రాడార్లు ముందే పసిగట్టగా, హై అలర్ట్‌ను ప్రకటించారు. ఆ క్షిపణి జపాన్‌పై పడే ప్రమాదం ఉండటంతో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు విషయాన్ని చేరవేశారు. దీంతో జనాలు పరుగులు తీశారు. 
 
అయితే ఉత్తర కొరియా తీరుపై జపాన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. పదే పదే తమ దేశం మీదుగా ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుండటం.. అవి పసిఫిక్ మహా సముద్రంలో పడుతుండటాన్ని గమనించిన జపాన్.. ఇకపై కిమ్ జాంగ్‌ దూకుడుకు బ్రేక్ వేయాలనుకుంటోంది. ఆయన చేష్టలను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది.

అయితే ఉత్తర కొరియా ప్రయోగించే క్షిపణులు జపాన్‌పై పడితే ఇక నగరాలు మాయమైపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జపాన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments