ఉత్తర కొరియా అణు పరీక్ష... పైకెగిరిన కొండ... కంపించిన చైనా సరిహద్దు...
ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష ధాటికి ఆ దేశంలోని పలు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ పరీక్షపై 38 నార్త్ అనే విశ్లేషణ సంస్థ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అణ్వస్త్ర పరీక్ష ని
ఇటీవల ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష ధాటికి ఆ దేశంలోని పలు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ పరీక్షపై 38 నార్త్ అనే విశ్లేషణ సంస్థ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిన తర్వాత తీసిన శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా ఈ విషయం అంచనా వేస్తున్నారు.
గత ఆదివారం ఉత్తర కొరియా ఆరోసారి అణు పరీక్ష నిర్వహించిన విషయం తెల్సిందే. పంగయి రీ పర్వత శ్రేణుల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షపై 38 నార్త్ అనే విశ్లేషణ సంస్థ కొన్ని విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ పరీక్ష తర్వాత చోటుచేసుకున్న మార్పులను చూపిస్తూ కొన్ని ఫోటోలను ప్రచురించింది. శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా ఈ ఫోటోలను తీసింది.
గతంలో పరీక్షలు నిర్వహించిన దాని కన్నా ఈసారి ప్రకంపనలు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆదివారం జరిగిన అణు పరీక్ష వల్ల సుమారు 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెల్సిందే. బాంబు పేలుడు తీవ్రత వల్ల చైనా సరిహద్దుల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఈ పరీక్ష వల్ల అనేక చోట్ల భూ ప్రకంపనలు కలిగాయని, దాని వల్ల కొండచరియలు కూడా విరిగిపడినట్లు 38 నార్త్ పేర్కొంది. బలమైన షాక్ వేవ్స్ వల్ల కొండలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది. అయితే పైకిఎగిరిన మట్టి పెళ్లలు మళ్లీ అదే స్థానంలో పడినట్లు అంచనా వేస్తున్నారు. మౌంట్ మన్‌టప్ దగ్గర కొండచరియలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.