Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు దక్షిణ కొరియా ప్లాన్.. సక్సెస్ అవుతుందా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది. ఈ మేరకు దక్షిణ కొరియా ప్రత్యేక టీమ్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఉత్తర కొరియా, ఇటీవల అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును సైతం

కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు దక్షిణ కొరియా ప్లాన్.. సక్సెస్ అవుతుందా?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:03 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది. ఈ మేరకు దక్షిణ కొరియా ప్రత్యేక టీమ్‌ను తయారు చేసినట్లు సమాచారం. ఉత్తర కొరియా, ఇటీవల అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును సైతం ప్రయోగించి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ మనుగడకు కిమ్ ఎప్పటికైనా ప్రమాదమేనని శత్రుదేశాలు భావిస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో స్పార్టన్ 3000 పేరిట ఓ ప్రత్యేక దళానికి కిమ్‌ను హతమార్చేందుకు కఠోర శిక్షనిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ బృందం ఉత్తర కొరియాలోకి చొరబడి ఆ దేశాధ్యక్షుడిని హతమారుస్తుందని.. ఉత్తర కొరియాలోకి ప్రవేశించాక దొరికిన వారిని దొరికినట్లు ఈ సైన్య బృందం మట్టుబెడుతుందని అమెరికా చెందిన ఓ నిపుణుడు తెలిపారు 
 
ఉత్తర కొరియా అధినేతలను హత్య చేసేందుకు దక్షిణ కొరియా ఈ తరహా ఘటనలకు పాల్పడటం ఇదే తొలిసారేంకాదు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు  విఫలమయ్యాయి. గతంలో కిమ్ సంగ్ 2ను చంపేందుకు ప్రయత్నించిన ఓ టీమ్‌లో సగం మంది స్వదేశం చేరుకోగా.. ఉత్తర కొరియాలో చిక్కుకున్న వారంతా తమను తామే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో పెట్రోల్ - డీజిల్ కార్లు బంద్... ఇకపై విద్యుత్ కార్లు