Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కయ్యాలమారి ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం?

కయ్యాలమారి ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సోమవారం ప్రకటించింది. ఇప్పటికే వరుస అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను ఉ.క

Advertiesment
North Korea LIVE updates
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (06:24 IST)
కయ్యాలమారి ఉత్తరకొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సోమవారం ప్రకటించింది. ఇప్పటికే వరుస అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులను ఉ.కొరియా నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలను గుర్తించామని దక్షిణ కొరియా రక్షణశాఖ వెల్లడించింది. అది ఖండాంతర క్షిపణి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ‘ఆదివారం నాటి అణు పరీక్ష తర్వాత మరో బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగానికి ఉత్తరకొరియా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి’ అని దక్షిణకొరియా వివరించింది. 
 
అయితే క్షిపణి వివరాలు, ఎప్పుడు ప్రయోగిస్తారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా ఆదివారం మరో దురుసు చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. ఆ దేశం అణు పరీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి. 
 
కాగా.. ఈ విస్ఫోటనంతో చోటుచేసుకున్న భూకంపాన్ని బట్టి ఇప్పటివరకూ ఉత్తరకొరియా నిర్వహించిన అణు పరీక్షల్లో ఇదే శక్తిమంతమైందని స్పష్టమవుతోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో ఈ బాంబును పరీక్షించింది. ఈ విస్ఫోటనం వల్ల వెలువడిన శక్తి 50 నుంచి 60 కిలోటన్నుల మధ్య ఉంటుందని దక్షిణకొరియా అంచనా వేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా వద్ద పిచ్చి వేషాలు వేయొద్దు : దినకరన్‌కు సుప్రీం వార్నింగ్