Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలస్తీనా ఎంబసీలో భారత రాయబారి అనుమానాస్పద మృతి

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:27 IST)
పాలస్తీనా దేశంలో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తూ వచ్చిన ముకుల్ ఆర్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆయన ఎంబసీలోనే విగతజీవిగా పడిపుండటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో విద్యను అభ్యసించారు. 
 
ఆ తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కాల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో పని చేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కూడా విధులు నిర్వహించారు. 
 
అలా ఉజ్వలమైన కెరీర్‌తో ముందుకుసాగుతూ వచ్చిన ముకుల్ ఆర్య ఉన్నట్టుండి విగతజీవిగా కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ధృవీకరించి, ఆయన మృతిపట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 
 
ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయేలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా, ముకుల్ ఆర్య భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments