ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఇచ్చిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలండ్, రొమేనియా దేశాల్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక పర్యటన చేపట్టనున్నారు.
తాము ప్రత్యక్షంగా యుద్దంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, కమలా హారిస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా వచ్చే వారంలో కమలా హారిస్ ఆ దేశాల్లో పర్యటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రష్యా దురాక్రమణలకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా కమలా హారిస్ పర్యటన వుంటుందని డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా కమలా హారిస్ మార్చి 9-11 మధ్య పోలండ్‌లో రాజధాని వార్సా, రొమేనియాలోని బుకారెస్ట్ టూరుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆ రెండు దేశాల నేతలతో సమావేశమై.. ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై చర్చించనున్నట్టు చెప్పారు.