Webdunia - Bharat's app for daily news and videos

Install App

'యోగి'తో రహస్య సమాచారం షేర్ చేసిన చిత్రా రామకృష్ణన్.. అరెస్టు

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (09:17 IST)
హిమాలయాల్లో ఉన్న ఒక యోగితో నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణన్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఓ యోగితో షేర్ చేసుకున్నందుకుగాను ఆమెను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. 59 యేళ్ల చిత్ర రామకృష్ణన్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌కు ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఈమె 2013-16 మధ్యకాలంలో ఎన్.ఎస్.ఈకి సీఈవోగా పని చేశారు ఆ సమయంలో ఎన్.ఎస్.ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని హిమాలయాల్లో నివసించే ఒక యోగితో షేర్ చేసుకున్నారు. అదీ కూడా ఈమెయిల్ ద్వారా షేర్ చేశారు. 
 
అయితే, ఆ యోగి ఎవరో కాదు... ఎన్.ఎస్.ఈ మాజీ ఉద్యోగి ఆనంద్ సుబ్రహ్మణ్యమేనని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఈ నెల ఆరంభంలోనే అరెస్టు అయిన విషయం తెల్సిందే. 
 
2010-15 మధ్య కాలంలో ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈ సమాచారాన్ని 2014-16 మధ్యకాలంలో గుర్తు తెలియని వ్యక్తితో చిత్రా రామకృష్ణన్ ఈమెయిల్ ద్వారా షేర్ చేసినట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కూడా సేకరించింది. దీంతో ఆమెను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments