Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీబీఐ నోటీసు తీసుకునేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి ససేమిరా..

Advertiesment
సీబీఐ నోటీసు తీసుకునేందుకు ఎంపీ అవినాశ్ రెడ్డి ససేమిరా..
, శుక్రవారం, 4 మార్చి 2022 (07:24 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి చిక్కుల్లో పడేలా ఉన్నారు. ఆయన వద్ద విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఇందుకోసం నోటీసు ఇవ్వజూపగా దాన్ని తీసుకునేందుకు ఆయన తిరస్కరించినట్టు సమాచారం. దీంతో కడప కోర్టును ఆశ్రయించి, న్యాయస్థానం ద్వారా నోటీసు ఇవ్వాలని సీబీఐ నిర్ణయించింది. 
 
కాగా, వివేకా హత్య కేసులో ఇప్పటికే 207 మందిని విచారించిన సీబీఐ 146 మంది వద్ద వాంగ్మూలాలు రికార్డు చేసింది. అయితే, ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయ పరిధిలోని స్పెషల్‌ క్రైమ్స్‌ మూడో విభాగం అధికారులతోపాటు మరికొందరు ముఖ్య అధికారులు గురువారం పులివెందులకు వచ్చారు. 
 
విచారణకు రావాలని అవినాశ్‌ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా వాటిని తీసుకునేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో సీబీఐ అధికారులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కోర్టు అనుమతి తీసుకుని శుక్రవారం మరోసారి నోటీసు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
వివేకా హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు కడగడం, మృతదేహంపై ఉన్న గాయాలకు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందితో కుట్లు వేయించి కట్లు కట్టించడంలాంటి ఆధారాల ధ్వంసంలో అవినాశ్‌ రెడ్డి పాత్ర ఉందని... వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసిందీ ఆయనే అని పలువురు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఆధారాల ధ్వంసం నుంచి వివేకా కుటుంబ సభ్యుల అనుమానాలు, నిందితుల వాంగ్మూలాలు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన అంశాల ఆధారంగా అవినాశ్‌ రెడ్డిని, భాస్కర్‌ రెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను వివారిస్తే ఓ కొలిక్కి వచ్చినట్టే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రికార్డు స్ధాయిలో ఎన్‌టీఎస్‌ఈలో అర్హత సాధించిన 440 మంది ఆకాష్-బైజూస్‌ విద్యార్థులు