ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (10:04 IST)
ఇరాన్ దేశంలోని దక్షిణ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో గల ఓడరేవులో శనివారం భారీ పేలుడు సంభవించగా, ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరినట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్‌ఐబీ వెల్లడించింది. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించింది. 
 
హార్మోజ్‌గాన్ గవర్నర్ మహమ్మద్ అషౌరీ తజియాని వెల్లడించిన వివరాల మేరకు.. పేలుడు తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో వెయ్యి మందికిపై గాయపడ్డారని తెలిపారు. వీరిలో 197 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫాతిమో మొహజెరాని సోషల్ మీడియా ద్వారా సంతాప దినం ప్రకటనను ధృవీకరించింది. 
 
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియాన్ ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించినట్టు అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments