Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Advertiesment
Pakistan

సెల్వి

, శనివారం, 26 ఏప్రియల్ 2025 (08:49 IST)
Pakistan
పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తప్పలేదు. భారత్‌తో యుద్ధానికి సై అంటే సై అంటూ రెచ్చిపోతున్న దాయాదికి గట్టి దెబ్బ తగిలింది. బలుచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్ఎ) జరిపిన దాడిలో పదిమంది సైనికులను పాకిస్తాన్ కోల్పోయింది. పాక్‌ సైనికకులను లక్ష్యంగా చేసుకుని మార్గట్‌ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. 
 
ఆ తర్వాత ఈ దాడి తమదే అని వీడియో విడుదల చేసింది బీఎల్‌ఏ. ఈ దాడిలో పది మంది పాక్‌ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా గత మార్చి నెలలో కూడా బలుచిస్తాన్‌ లిబరేషన్‌ జరిపిన దాడుల్లో 60 మంది వరకు హతమైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేసింది. 
 
బలుచిస్తాన్‌ ప్రజలను పాకిస్తాన్‌ ప్రభుత్వం అణచివేస్తోంది. శుక్ర‌వారం పాక్‌లోని క్వెట్టాలో బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ చేప‌ట్టిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు కోల్పోయారు. ఇదిలా ఉండగా పహల్గాం దాడి తర్వాత మాత్రం పాకిస్తాన్ తమ దేశాన్ని అలెర్ట్ చేసింది. సైన్యాన్ని సిద్ధం కావాలని ఆదేశించింది. అంతే కాదు ఎల్ఓసీ వద్ద కవ్వింపు చర్యలు కూడా చేపట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

May 2025 Bank Holidays: మే 2025 బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసిన ఆర్బీఐ