Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

Advertiesment
Hanif Abbasi o

ఠాగూర్

, ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (11:43 IST)
పాకిస్థాన్ మంత్రి ఒకరు పిచ్చి ప్రేలాపనలు పలుకుతున్నారు. భారత్‌పై అణుబాంబులతో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం వందలకొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. వీటితో పాటు ఘోరీ, షహీన్, ఘజినీ వంటి క్షిపణులు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డాడు. 
 
కాశ్మీర్ లోయలోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో పాకిస్థాన్‌కు నదీ జలాలు సఫరారు చేసే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ నేతలు ఇష్టానుసారంగా పెట్రేగిపోతున్నారు. నోటికొచ్చినట్టుగా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. 
 
పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపరిచామని, భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడితే తాము అణ్వాయుధ దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణలు ప్రదర్శన కోసం కాదు. అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయి అని మంత్రి అబ్బాసీ అన్నారు. 
 
పాకిస్థాన్ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీకి ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. రెండు రోజుల గగనతనం మూసివేస్తేనే భారత్ వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరునిపోయిందన్నారు. మరో పది రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సస్థలు దివాళా తీస్తాయని చెప్పారు. అంతేకాకుండా, ఇబ్బందులు ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నట్టు చెప్పారు. అంతకుముందు రోజే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆఫీస్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్