Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ రక్తమోడిన అమెరికా... బల్లల కింద దాక్కుని....

అగ్రరాజ్యం అమెరికా మరోమారు రక్తమోడింది. మేరీల్యాండ్‌లోని అన్నాపోలీస్‌లో క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంత

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (09:08 IST)
అగ్రరాజ్యం అమెరికా మరోమారు రక్తమోడింది. మేరీల్యాండ్‌లోని అన్నాపోలీస్‌లో క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటన స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 2:35 సమయంలో జరిగింది.
 
ఈ పత్రికా కార్యాలయం వెస్ట్‌ఫీల్డ్ అన్నాపోలీస్ మాల్ సమీపంలోని బెస్ట్‌గేట్ రోడ్డులో ఉంది. నాలుగు అంతస్తుల ఈ భవనంపై ఓ గ్లాస్ డోర్ నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య ఘటనతో అందులో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు ఉద్యోగులు బల్లల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
 
కాల్పుల వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని కాల్పులు జరిపిన ఉన్మాది అదుపులోకి తీసుకున్నాయి. అతన్ని జర్రోడ్ రమోస్‌గా గుర్తించాడు. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం‌ప్‌కు సమాచారం అందించామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
 
మరోవైపు, ఈ పత్రికా కార్యాలయంపై జరిగిన కాల్పులను అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. 'జర్నలిస్టులు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నారు. వారిపై దాడిచేయడమంటే ప్రతి అమెరికన్‌పైనా దాడిచేయడమే' అంటూ వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ శారా సాండర్స్ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments