కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి... చిట్టెలుకతో గుత్తొంకాయ కూర... (Video)
మధ్యాహ్నమైతే చాలు... కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటాం. అంటే.. నిజంగా ఎలుకలు పరిగెత్తవు. బాగా ఆకలి అవుతుందన్నదానికి సంకేతం. ఏదేని పనిమీద బయటిఊర్లకు వెళితే హోటల్‌కెళ్లి భోజనం చేస్తాం. అలా వరంగల్ అర
మధ్యాహ్నమైతే చాలు... కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా అంటాం. అంటే.. నిజంగా ఎలుకలు పరిగెత్తవు. బాగా ఆకలి అవుతుందన్నదానికి సంకేతం. ఏదేని పనిమీద బయటిఊర్లకు వెళితే హోటల్‌కెళ్లి భోజనం చేస్తాం. అలా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సుబేదారిలోని ఓ టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు ఓ వ్యక్తి. భోజనం ఆర్డర్ చేశాడు.
కూరల్లో గుత్తివంకాయ కూడా ఉంది. నిగనిగలాడుతూ.. ఘుమఘుమలాడుతోంది. ఆవురావురు అంటూ ఓ వంకాయను నోట్లో పెట్టుకున్నాడు. అంతే షాక్ అయ్యాడు.. అది గుత్తొంకాయ కాదు.. ఎలుక.. చిన్న చిట్టెలుక. ఇంకేమైనా ఉందా.. ఒళ్లు వణికింది.. గుండె దడ పెరిగింది.. ఆ ఎలుకను అలాగే పట్టుకుని హోటల్ నిర్వాహకులకు చూపించాడు.. బయటకు వచ్చాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వరంగల్‌కి చెందిన రమేశ్ భార్య హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఆమెకు భోజనం తీసుకెళ్లేందుకు హోటల్‌కు వెళ్లి ఆర్డర్ ఇచ్చారు. ఇంతలో తనకూ ఆకలి కావడంతో తాను కూడా భోజనం చేసేందుకు కూర్చొన్నాడు.
ఈ క్రమంలో గుత్తొంకాయ కూరలో ఎలుక ప్రత్యక్షమైంది. వంకాయ ముక్క అని భావించి నోట్లో పెట్టుకున్న క్రమంలో ఎలుకను గుర్తించాడు. ఈ క్రమంలో ఆయన కొద్దిపాటి అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. అనంతరం హోటల్ యాజమాన్యం నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది.