Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా.. అయితే విషం తాగుతున్నట్టే...

చాలా మంది దాహం వేయకపోయినా పదేపదే నీళ్లు తాగుతుంటారు. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు చెప్పే సూచనను పాటించే క్రమంలో ఈ పని చేస్తుంటారు. కానీ, దాహం వేయకపోయినా అతిగా నీళ్లు తాగితే అవి విష

దాహం వేయకపోయినా నీళ్లు తాగుతున్నారా.. అయితే విషం తాగుతున్నట్టే...
, బుధవారం, 20 జూన్ 2018 (09:28 IST)
చాలా మంది దాహం వేయకపోయినా పదేపదే నీళ్లు తాగుతుంటారు. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని వైద్యులు చెప్పే సూచనను పాటించే క్రమంలో ఈ పని చేస్తుంటారు. కానీ, దాహం వేయకపోయినా అతిగా నీళ్లు తాగితే అవి విషంతో సమానమని వైద్యులు చెపుతున్నారు. ఇదే విషయంపై ఆస్ట్రేలియా, విక్టోరియాలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ సర్వే చేయించారు. 
 
రోజుకు 8 గ్లాసులు నీళ్లు తాగాలని డాక్టర్లు సూచించటం కూడా తప్పేనంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. ఏదో అల్లాటప్పాగా చెప్పటం లేదని.. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని చెబుతున్నాని పరిశోధకులు చెపుతున్నారు. ఇదే అంశంపై రెండు రకాలుగా పరిశోధనలు చేశారంట. ఒకటి దాహం వేసినప్పుడు నీళ్లు తాగేవారిపై.. దాహం లేకపోయినా తరచూ నీళ్లు తీసుకునే వారిపై వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. దాహం వేయకపోయినా నీళ్లు తాగేవారిలో మార్పులు గమనించారంట. 
 
* దాహం అయినప్పుడే నీళ్లు తాగిన వారి శరీరంలో నీటి శాతం సమతూకంగా ఉంది. 
* దాహం లేకపోయినా నీళ్లు తాగితే.. మొదట మెదడు చురుగ్గా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా నీరు విషంగా మారి మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది. 
* నీరు అధికమవుతే అది విషంగా మారే అవకాశం ఉంది. 
* ఎక్కువ నీళ్లు తాగితే రక్తంలో సోడియం శాతం తగ్గిపోతుంది. 
* తరచూ నీళ్లు తాగుతుంటే.. హైపోనెట్రేమియా అనే వ్యాధి వస్తుంది. 
* దాహం లేకపోయినా నీళ్లు తాగేవాళ్లలో జలుబు, ముక్కు కారడం, తల బరువుగా ఉంటుంది. 
* హైపోనెట్రేమియా అనే వ్యాధి వస్తే.. చివరి దశలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
* అంటే నీరు అధికంగా తాగడం వల్ల జలం ప్రాణం తప్పదంటున్నారు. అదే ఎక్కువైతే విషం అని తేల్చారు. సో.. నీళ్లు అవసరాన్ని బట్టి తాగాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్తు కోసమనీ పన్ను ఊడపీక్కొచ్చా...