Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్ వెగాస్ నరమేధంపై ట్రంప్ దిగ్భ్రాంతి... 58కి చేరిన మృతులు

అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన విషాద సంఘటనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (06:03 IST)
అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరిగిన విషాద సంఘటనపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ఎంతో భయంకరమైన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కోసం నేను, మెలానియా దేవుడిని ప్రార్థిస్తున్నాం. యావత్తు దేశం కోసం, ఐక్యత, శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ బాధ నుంచి కోలుకునే శక్తిని బాధిత కుటుంబాలకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని అందులో పేర్కొన్నారు. 
 
కాగా, అమెరికా లాస్‌వెగాస్‌లోని మండాలే బే హోట‌ల్‌లో దుండగుడు జ‌రిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 58కి పెరిగింద‌ని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. కాల్పులు జ‌రిపిన‌ దుండ‌గుడిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 200 మందికి పైగా గాయాలు అయ్యాయ‌ని, వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. దుండ‌గుడు ఓ గ‌దిలో ఉండి ఈ కాల్పులకు పాల్ప‌డ్డాడ‌ని ఆ గ‌దిలో పెద్ద ఎత్తున తుపాకులు కూడా ల‌భ్య‌మ‌య్యాయ‌ని చెప్పారు. ఈ కాల్పుల‌కు పాల్ప‌డిన దుండ‌గుడు లాస్ వెగాస్ వాసేన‌ని పోలీసులు ధృవీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments