అమెరికా లాస్‌వెగాస్‌లో నరమేధం.. 20 మందికి పైగా మృతి
అమెరికా లాస్‌వెగాస్‌లో కొందరు దుండగులు నరమేధం సృష్టించారు. స్థానిక మాండలే బే హోటల్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మందికిపైగా మృతి చెందారు. మరో 100 మంద
అమెరికా లాస్‌వెగాస్‌లో కొందరు దుండగులు నరమేధం సృష్టించారు. స్థానిక మాండలే బే హోటల్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 20 మందికిపైగా మృతి చెందారు. మరో 100 మందికిపైగా గాయాలపాలయ్యారు.
కాల్పులకు పాల్పడ్డ దుండగుల్లో ఒకరిని అక్కడి పోలీసులు హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లి పోయింది. ప్రాణ భయంతో అక్కడి వారు పరుగులు తీశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, సంఘటనా స్థలానికి ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. కాసినో హోటల్ 31వ అంతస్తులో కాల్పుల ఘటన చోటుచేసుకుందని, ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారని ట్విటర్‌లో ఒకరు పోస్ట్ చేశారు. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు.
లాస్‌వెగాస్ ప్రధాన రిసార్ట్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ముఖ్యంగా గాంబ్లిక్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఈ సిటీ ప్రాచుర్యం పొందింది. కాగా, కాల్పులు జరిగిన హోటల్ సమీపంలోనే మెక్కారన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉండటంతో కొద్ది గంటల సేపు విమానాల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.