Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైనర్ బాలికపై పాలీసు వాహనంలోనే కీచరకపర్వం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కీచకపర్వం జరిగింది. సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచార దాడికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉ

మైనర్ బాలికపై పాలీసు వాహనంలోనే కీచరకపర్వం
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (09:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో కీచకపర్వం జరిగింది. సామాన్యులకు భద్రత కల్పించిన రక్షకభటులే మైనర్ బాలికపై సామూహిక అత్యాచార దాడికి పాల్పడ్డారు. ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోవింద్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇన్‌స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్‌లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో టెన్త్‌ క్లాస్ చదివే ఓ విద్యార్థినిని వీరిద్దరూ నిత్యం వేధింపులకు గురిచేసేవారు.
 
ఈ క్రమంలో ఇటీవల విద్యార్థిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వీరు ఆమెను అడ్డగించారు. ఆమెను వెంటనే పోలీసు వాహనంలో ఎక్కించుకుని గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. తనపై అఘాయిత్యం చేయవద్దని ప్రాధేయపడుతున్నా ఖాకీ కీచకులు పట్టించుకోలేదు. మృగాళ్లుగా మారి ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించి, మైనర్‌ను ఓ చోట వదిలేసి వెళ్లారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పగా, కుటుంబసభ్యులు గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా వారిని ఇంటికి పంపించారు.
 
సామాజిక కార్యకర్త లక్ష్మీ గౌతమ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, మీడియాలో జరిగిన విషాదం వెలుగుచూడటంతో మథుర ఎస్పీ స్పందించారు ఆయన ఆదేశాల మేరకు నిందితులపై కేసు నమోదుచేశారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్‌స్పెక్టర్ దుర్గా రమాకాంత్ పాండే, ప్రవీణ్ ఉపాధ్యాయ్‌ను విధుల నుంచి తొలగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కనిగిరి కీచకపర్వంపై కన్నీళ్లు పెట్టుకున్న నన్నపనేని.. వీధికుక్కల్లా, ఊరకుక్కల్లా..?