Webdunia - Bharat's app for daily news and videos

Install App

#JoeBiden ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం.. అతిథుల కోసం నోరూరించే వంటకాలు!

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (10:19 IST)
జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. అదేసమయంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీకాలం బుధవారం మధ్యాహ్నంతో ముగిసిపోతుంది. ఆ తర్వాత బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 
 
అయితే, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. విందు మెనూలో పలు శాకాహార, మాంసాహార వంటకాలు ఉన్నాయి. ప్రముఖ చెఫ్‌ రాబర్ట్‌ డోర్సీ ఆధ్వ‌ర్యంలో ఈ వంట‌లు చేశారు. 
 
కమలా హారిస్ బాగా ఇష్టప‌డే సీఫుడ్‌ గంబో సూప్‌ కూడా అతిథుల‌కు వ‌డ్డించ‌నున్నారు. షెల్‌ ఫిష్‌, కాప్సికం, ఉల్లిపాయల‌తో దీన్ని చేస్తారు. అతిథుల‌కు వ‌డ్డించే వంట‌కాల్లో పాంకో క్రస్టెడ్‌ క్రాబ్‌ కేక్స్‌, ఆర్గానిక్‌ కోస్టల్‌ గ్రీన్స్‌లు కూడా ఉన్నాయి.
 
ఇకపోతే, వైట్‌రైస్‌, లూసియానా లవ్‌, డీప్ అంబర్‌ రౌక్స్‌, స్వీట్‌ పెప్పర్స్‌, బ్లాకెన్‌డ్‌ చికెన్ వంటివి కూడా మెనూలో ఉన్నాయి. అలాగే, బనానా రైసిన్‌ బ్రెడ్‌ పుడ్డింగ్‌, బౌర్‌బోన్‌ కారమెల్ స్వీట్ల‌ను కూడా అతిథులకు వడ్డిస్తారు. వీటితో పాటు.. మరికొన్ని భారతీయ వంటకాలు కూడా సిద్ధంచేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments