Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్వేతసౌధానికి భారతీయ వన్నె : అందరి కళ్లూ ఆమెపైనే!!

శ్వేతసౌధానికి భారతీయ వన్నె : అందరి కళ్లూ ఆమెపైనే!!
, బుధవారం, 20 జనవరి 2021 (06:50 IST)
భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పైగా, ఈమె భారతీయ సంతతికి చెందిన మహిళ కావడంతో ప్రతి ఒక్కరి కళ్లూ ఆమెపైనే కేంద్రీకృతమైవున్నాయి. 
 
ఆఫ్రికన్‌- ఏషియన్‌ మూలాలున్న కమలా హారిస్... శ్యామలా గోపాలన్‌. ఈమె తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. 1958లోనే అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో 1964 అక్టోబరు 20వ తేదీన కమలా హారిస్ జన్మించారు. ఈమె తండ్రి జమైకా వాసి. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2016లో సెనేట్‌కు ఎన్నికయ్యారు. 
 
బైడెన్‌ హయాంలో ఓ చరిత్రాత్మక పాత్రను ఆమె పోషించబోతున్నారంటూ అమెరికన్‌ మీడియా ఇప్పటికే అనేక కథనాలు రాసింది.. రాస్తోంది. 'మా ముందున్నది సంక్లిష్టమైన దారి. మేం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం అంత సులువు కాదని మాకు తెలుసు. అయితే ఓ స్థిర సంకల్పంతో ఈ ప్రయాణం ప్రారంభిస్తున్నాం' అని తాజాగా వ్యాఖ్యానించారు. 
 
'దేశంలో చాలా అసమానతలున్నాయి... ఉమ్మడిగా మనం పోరాడాలి' అంటూ ఆమె పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో బైడెన్‌ మరోసారి పోటీచేయకపోవచ్చన్న అంచనాలుండటంతో అపుడు కమలే ఆటోమేటిక్‌గా డెమాక్రాట్‌ అభ్యర్థి అవుతారని వినిపిస్తోంది. ఆమె కాబోయే అధ్యక్షురాలని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. 
 
ఇదిలావుంటే, ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్ సోమవారం సెనేటర్‌ పదవికి రాజీనామాను చేశారు. తన రాజీనామా లేఖను కాలిఫోర్నియా గవర్నర్‌ కెవిన్‌ న్యూసోమ్‌కు సమర్పించారు. దేశ ఉపాధ్యక్షురాలే సెనెట్‌ ప్రెసిడెంట్‌ కానుండడం వల్ల ఆ హోదాలో ఆమె పాత్ర కీలకం కానుంది. 
 
వంద మంది సభ్యులున్న సెనెట్‌లో రిపబ్లికన్లు- డెమొక్రాట్లకు చెరో 50 మంది బలం ఉంది. దీంతో కీలకమైన చట్టాల విషయంలో కమల ఓటు కీలకమవుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఆమె డెమొక్రాట్‌ అభ్యర్థిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జో బైడెన్ ముందున్నది పూలబాట కాదా? సవాళ్ళ స్వాగతం!