Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (10:12 IST)
దేశంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడైంది. గత 24 గంటల్లో 13,823 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 16,988 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 162 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,718కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,02,45,741 మంది కోలుకున్నారు. 1,97,201 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,85,66,947 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,64,120 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 351 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,86,893 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,583కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,919 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,270 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments