Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీని మించిన రిషబ్ పంత్.. బయోగ్రఫీని ఓ లుక్కేద్దామా? (Video)

Advertiesment
India national cricket team
, మంగళవారం, 19 జనవరి 2021 (14:59 IST)
బ్రిస్బేన్ టెస్ట్‌లో ఇండియన్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్ర‌మంలో అత‌డు లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఇండియ‌న్ వికెట్ కీప‌ర్‌గా పంత్ నిలిచాడు. 16వ టెస్ట్ ఆడుతున్న పంత్‌.. త‌న 27వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ని కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ 2 సెంచ‌రీలు, 3 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 
 
పంత్ కంటే ముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 1000 ప‌రుగుల మైల్‌స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న పంత్‌.. కంగారూ గ‌డ్డ‌పై త‌న ప‌రుగుల ప్ర‌వాహాన్ని కొన‌సాగిస్తున్నాడు. టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు చేసిన ఏడో భార‌త వికెట్ కీప‌ర్‌గా కూడా పంత్ నిలిచాడు. 
 
రిషబ్ పంత్ పూర్తి పేరు : రిషబ్ రాజేంద్ర పంత్ 
పుట్టిన తేదీ : అక్టోబర్ 4, 1997, హరిద్వార్, ఉత్తరాఖండ్ 
వయస్సు : 23 సంవత్సరాలు 107 రోజులు 
ప్లేయింగ్ రోల్: వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 
బ్యాటింగ్ స్టైల్: ఎడమ చేతి వాటం 
ఫీల్డింగ్ పొజిషన్: వికెట్ కీపర్ 
ఆడుతున్న జట్లు : భారత్, ఢిల్లీ, ఢిల్లీ కేపిటల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఢిల్లీ అండర్-19, ఇండియా ఎ, ఇండియా రెడ్, ఇండియా అండర్-19, ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్, నార్త్ జోన్.
 
ఆడిన టెస్టులు-16, ఇన్నింగ్స్ -27, పరుగులు-1088, అత్యధిక స్కోరు-159. శతకాలు-2, అర్థశతకాలు - 4, సిక్సర్లు- 23. 
టీ-20 - 111 మ్యాచ్‌లు, 108 ఇన్నింగ్స్‌లు, పరుగులు -3018, అత్యధిక స్కోరు-128, రెండు శతకాలు, 18 అర్థ శతకాలు, 264 ఫోర్లు, 151 సిక్సులు.
వన్డేలు : మ్యాచ్‌లు 16, ఇన్నింగ్స్-14, పరుగులు-374, అత్యధిక స్కోర్ 71, అర్థ శతకాలు-1, ఫోర్లు 40, సిక్సులు పది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిరాజ్ మగాడు.. నీ భర్తకు ఆ సామర్థ్యం లేదా? షాకైన అలీసా హీలీ