Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జెనిఫర్ లోఫెజ్ ఆటపాటలు... బైడెన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఏంటి?

జెనిఫర్ లోఫెజ్ ఆటపాటలు... బైడెన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఏంటి?
, బుధవారం, 20 జనవరి 2021 (06:01 IST)
అమెరికా దేశ 46వ అధ్యక్షుడుగా డెమొక్రటిక్ అభ్యర్థిగా విజయం సాధించిన జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారు. అలాగే, అమెరికా చట్టాల సంప్రదాయం ప్రకారం ఆయన కంటే ముందుగానే ఉపాధ్యక్షురాలిగా భారత మూలాలు ఉన్న కమలా హారిస్‌ పదవీస్వీకారం చేయాల్సి ఉంటుంది. 
 
ఈ ప్రమాణస్వీకారోత్సవం కేపిటల్‌ భవనం వెలుపలే జరుగుతుంది. అనంతరం బైడెన్‌ శ్వేతసౌధంలోకి అడుగుపెడతారు. మిలటరీ బ్యాండ్‌ మోత మధ్య దేశ సైనికాధికారులు ఆయనను, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ను, కమలా హారిస్‌ దంపతులను వెంట తోడ్కొని వెళతారు. ఈసారి కేవలం 200మందిని మాత్రమే ప్రమాణ వేదిక వద్దకు అనుమతిస్తున్నారు. వీరందరికీ కొవిడ్‌ పరీక్షలు చేసి ధ్రువీకరించుకున్నాకే అనుమతి ఇచ్చారు.
 
నిజానికి దేశ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది క్యాపిటల్ భవనం వద్దకు తరలివస్తారు. కానీ, ఈసారి అలాంటి పరిస్థితిలేదు. ఓవైపు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండటం, మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడుల భయం కారణంగా ప్రజల సందర్శనను నిలిపివేశారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవ ఉత్సవాల పాసుల నిమిత్తం సాధారణంగా 2 లక్షల టిక్కెట్లను విక్రయిస్తారు. కానీ ఈసారి కేవలం వెయ్యి టిక్కెట్లను మాత్రమే ఇచ్చారు. ప్రమాణస్వీకారం తర్వాత సైనిక పరేడ్‌ పెన్సిల్వేనియా ఎవెన్యూ వద్ద జరగాలి. కొత్త కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో బైడెన్‌ సైనిక వందనం అందుకోవాల్సి ఉన్నా ఈసారి వీడియో లింక్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 
 
వేడుకలను కుదించినప్పటికీ అమెరికన్‌ సంప్రదాయాలకు అనుగుణంగా ఆటపాటలు కొనసాగిస్తున్నారు. బైడెన్‌కు అభిమాని అయిన పాప్‌ సింగర్‌ లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఇక సుప్రసిద్ధ నటి, గాయని, డాన్సర్‌ జెనిఫర్‌ లోఫెజ్‌ తన ఆటపాటలతో అలరిస్తారు. ప్రముఖ నటుడు టామ్‌ హాంక్స్‌ ఓ గంటన్నరపాటు ప్రముఖ నటీనటులతో ఓ షో నిర్వహిస్తారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్ శకానికి స్వస్తి.. నేడు బైడెన్‌ ప్రమాణ స్వీకారం