Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫలరాజం' వాసనకు బెంబేలెత్తిపోయిన విమాన ప్రయాణికులు...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (12:19 IST)
ఫలరాజం పండ్ల నుంచి వచ్చిన వాసనకు విమాన ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఆ పండ్లను విమానం నుంచి అన్‌లోడింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా, ఆ పండ్లను దించేసిన తర్వాత విమానం ముందుకు కదిలింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సోమవారం ఇండోనేషియా సుమత్రాలోని బెంగ్‌కులు నుంచి జకర్తా వెళ్లేందుకు శ్రీ విజయ ఎయిర్ ఫ్లైట్‌ సిద్ధంగా ఉంది. ఈ విమానంలో ప్రయాణికులు ఎక్కి కూర్చగా, కొన్ని రకాల సరకులు, పండ్లను కూడా లోడింగ్ చేశారు. ఇలాంటివాటిలో డురియన్ పండ్లు కూడా ఉన్నాయి. వీటి కారణంగా ఈ విమానం ఉన్నఫళంగా నిలిపి వేయాల్సి వచ్చింది. 
 
ఆ పండ్ల నుంచి దుర్గంధం వెదజల్లు తుండటంతో ప్రయాణికులంతా ముక్కులు మూసుకుని ఉక్కిరిబిక్కిరయ్యారు. వాటిని దించేస్తే తప్ప విమానం ఎక్కబోమని వారంతా పట్టుబట్టడంతో.. అధికారులు హుటాహుటిన పండ్లను ఖాళీచేసేశారు. సుమారు గంటసేపటి హైడ్రామా తర్వాత గానీ విమానం బయల్దేరి వెళ్లింది. 
 
నిజానికి పనస పండు మాదిరిగా ఉండే డురియన్ పండ్లను ఉష్ణమండల ఫలాలుగా పిలుస్తారు. ఇది కుళ్లిన మురుగు వాసన వస్తుంది. అయితే రుచి మాత్రం మధురంగా ఉండటంతో దీన్ని కొందరు ఫలరాజంగా పిలుస్తారు. సాధారణంగా ఈ పండ్లను ప్యాక్ చేసేటప్పుడే పాండాన్ ఆకులు, కాఫీ పౌడర్ వంటివి  ఉపయోగిస్తారు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా విమానంలో ఎక్కించిన డురియన్ పండ్లు వాసన వెదజల్లినట్టు శ్రీవిజయ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ప్రయాణికుల రక్షణ దృష్ట్యా ఈ పండ్లను అన్‌లోడింగ్ చేసినట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments