Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర‌విబాబు దూకుడుకి బ్రేక్ వేసిన సురేష్ బాబు

ర‌విబాబు... ఈ పేరు విన‌గానే ఎలాంటి సినిమాలు తీస్తారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌తి సినిమాలో ఏదో వైవిధ్యం చూపించాల‌నుకుంటారు. అల్ల‌రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన ర‌విబాబు త‌ర్వాత పార్టీ, న‌చ్చావులే, నువ్విలా, అవును... ఇలా విభ

ర‌విబాబు దూకుడుకి బ్రేక్ వేసిన సురేష్ బాబు
, శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:23 IST)
ర‌విబాబు... ఈ పేరు విన‌గానే ఎలాంటి సినిమాలు తీస్తారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌తి సినిమాలో ఏదో వైవిధ్యం చూపించాల‌నుకుంటారు. అల్ల‌రి సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించిన ర‌విబాబు త‌ర్వాత పార్టీ, న‌చ్చావులే, నువ్విలా, అవును... ఇలా విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు చేసాడు. తాజాగా అదుగో అనే సినిమాని తెర‌కెక్కించాడు. ఇందులో పందిపిల్ల ప్రధాన పాత్ర పోషించ‌డం విశేషం. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ టీజ‌ర్లో బంటి (పంది పిల్ల) చెప్పినట్టు చేయడం.. డాన్స్ కూడా చేయ‌డం చూపించారు. ఈ టీజర్ చిన్నపిల్లలను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. అస‌లు ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి పంది పిల్ల‌తో సినిమా ఏంటి..? ఈ సినిమాలో ఏం చూపించ‌నున్నాడు..? క‌థ ఏంటి..? అని ఆడియ‌న్స్‌లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ అయ్యింది. దీనికితోడు టీజ‌ర్లో కేవ‌లం బంటిని మాత్ర‌మే చూపించ‌డంతో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. 
 
ఇదిలాఉంటే... ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. అయితే.. సురేష్ బాబుకి ఒక ప‌ట్టాన ఏదీ న‌చ్చ‌దు. అందుచేత ఈ సినిమా ఎప్పుడో రెడీ అయ్యింద‌ట. ర‌విబాబు రిలీజ్ చేసేద్దాం అంటే... కాస్త ఆగు అంటూ బ్రేక్ వేసి రిపేర్లు చేయించాడ‌ట‌. ఇప్పుడు ఆయ‌న అనుకున్న విధంగా రావ‌డంతో రిలీజ్ చేస్తున్నార‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యు ట‌ర్న్ సెన్సార్ పూర్తి.. ‘U/A’ స‌ర్టిఫికేట్..