Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంది పిల్లకు పళ్లు తోముతున్న రవిబాబు.. వీడియో వైరల్!

ర‌విబాబు విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు. త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ... ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న ర‌విబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా అల్లిన కథతో రవిబాబు ‘అదుగో’ అనే సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తెల్ల పందిపిల్లతోనే వ

Advertiesment
Ravi Babu
, బుధవారం, 30 మే 2018 (14:37 IST)
ర‌విబాబు విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు. త‌న‌దైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ... ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న ర‌విబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా అల్లిన కథతో  రవిబాబు ‘అదుగో’ అనే సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ తెల్ల పందిపిల్లతోనే విభిన్నంగా తన సినిమా ప్రచారం చేసుకుంటున్నాడు దర్శకుడు. గతంలో ఓసారి దాన్ని పట్టుకుని ఏటీఎం ముందు క్యూలో నిలబడి అందరి దృష్టినీ తన సినిమాపైకి తిప్పుకున్న రవిబాబు, తాజాగా పబ్లిసిటీ కోసం మరో ప్రయోగం చేశాడు.
 
ఇంత‌కీ ఏం చేసాడంటారా..?  పంది పిల్లకు పళ్లు తోముతూ దాన్ని బుజ్జగిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో రవిబాబు తండ్రి, నటుడు చలపతిరావు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా అందర్నీ బాగా నవ్విస్తుందని, మీ ఆశీస్సులు ఈ చిత్రానికి ఉంటాయని ఆశిస్తున్నానని చలపతి రావు పేర్కొన్నారు. ప్రతి సినిమాకూ ప్రేక్షకుల ఆశీస్సులు ఉండబట్టే బాగా ఆడుతున్నాయని, ప్రేక్షక దేవుళ్లకు మరోసారి నమస్కారాలు తెలుపుతున్నానని, ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండని అన్నారు. 
 
‘అదుగో’ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. హార‌ర్‌, సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే రవిబాబు ఈసారి అదిగో అంటూ మరో ప్రయోగంతో ముందుకు వస్తున్నాడు. మ‌రి... ఈ ప్ర‌యోగం ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మ 'ఆఫీసర్' ఏమవుతాడో... ఈ క‌థ‌కు ఇన్స్పిరేష‌న్ ఎవ‌రంటే?