ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 188 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్ బోయింగ్ 737 విమానం సముద్రంలో కూలిపోయింది. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఏసీటీతో సంబంధాలు తెగిపోయాయి. జకార్తా నుంచి బయలుదేరిన ఈ విమానం బాంకా బెలిటంగ్ ద్వీపంలోని పంకాల్ పినాంగ్ వెళ్లాల్సి ఉంది.
విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకు సముద్రం మీది నుంచి ప్రయాణిస్తుండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆపై ఆ విమానం సముద్రంలో కూలినట్లు అధికారులు గుర్తించారు. సంఘటనా స్థలికి సహాయక బృందాలు చేరుకున్నాయి.
కానీ సముద్రంలో విమానం కూలిపోవడంతో.. మృతుల సంఖ్య భారీగా వుండే అవకాశం వుందని.. ప్రయాణీకులంతా నీటిలో మునిగిపోయివుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రయాణికుల్లో 178 మంది పెద్దలు, ఓ చిన్నారి, ఇద్దరు బేబీలు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.