Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మందు కనిపెట్టాం: డిస్ట్రిబ్యూటెడ్‌ బయో

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:22 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నుంచి మానవాళిని కాపాడే ఔషధాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని, కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న డిస్ట్రిబ్యూటెడ్‌ బయో కంపెనీ ప్రకటించింది.

ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్‌ వైరస్‌ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్‌ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు.

ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని, సార్స్‌ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్‌ జాకబ్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి కరోనా వైరస్‌ మానవ శరీరంలోని ఎస్‌ - ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ప్రయోగించిన యాంటీ బాడీస్, ఎస్‌ - ప్రొటీన్‌ ను నిర్వీర్యం చేస్తున్నాయని, తద్వారా కరోనా వైరస్‌ కూడా నాశనం అవుతోందని ఆయన అన్నారు.

ప్రస్తుతం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్న వాక్సిన్, సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని వెల్లడించారు. తమ ప్రయోగ ఫలితాలను మరో రెండు ల్యాబ్స్ సాయంతో నిర్ధారించుకుంటున్నామని జాకబ్ గ్లాన్‌ విల్లె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments