కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతల అక్రమాలు: యనమల

గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:04 IST)
‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు  పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఏపీ సీఎం జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు.

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని మీడియా సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై జగన్ కు ఎంత శ్రద్ధ ఉందన్న విషయం ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఏదో మొక్కుబడిగా మీడియా సమావేశం నిర్వహించారని, రాష్ట్ర ఆదాయం మందగిస్తోందని చెప్పిన జగన్, దీని నుంచి బయటపడేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టబోతున్నారో చెప్పలేదని, ఈ విషయంలో నిపుణుల సలహాలు కూడా జగన్ తీసుకోలేదని విమర్శించారు.

మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా విలేకరులకు జగన్ ఇవ్వలేదని, ‘కరోనా’ను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు