Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:59 IST)
విద్యార్థులకు శుభవార్త... ఏపీలో నిర్వహించే ఎంసెట్​, ఈసెట్​, పీజీసెట్​ లాంటి వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

లాక్​డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 132కి చేరిన కరోనా కేసుల సంఖ్య