Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో హోటల్ ఎంట్రెన్స్‌లో మలవిసర్జన - భారతీయ కార్మికుడికి అపరాధం

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (15:06 IST)
మద్యం మత్తులో స్టార్ హోటల్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద మలవిసర్జన చేసిన ఓ భారతీయ కార్మికుడికి సింగపూర్ కోర్టు రూ.25 వేల అపరాధం విధించింది. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే 400 సింగపూర్ డాలర్లు (రూ.25వేలు) జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
వర్క్ పర్మిట్‌తో సింగపూర్‌లో ఉంటున్న రాము అనే వ్యక్తి.. క్యాసినో ఆడేందుకు ప్రముఖ 'మెరీనా బే సాండ్స్' రిసార్ట్స్ అండ్ హోటల్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం తాగాడు. కొద్దిసేపు గ్యాంబ్లింగ్ ఆడిన అతడు.. బాత్రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. కానీ, అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కష్టమైంది. మద్యం మత్తులో.. చివరకు ఎంట్రెన్స్ వద్ద ఫ్లోర్ మీదే విసర్జించాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబరు 30వ తేదీన చోటుచేసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటో అప్పట్లో వైరల్‌గా మారింది.
 
జూన్ 4వ తేదీన క్యాసినో కోసం రాము మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. వెంటనే గుర్తించిన సిబ్బంది. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో రాము తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని తీవ్రంగా మందలించిన న్యాయమూర్తి.. 400 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.25వేలు) జరిమానా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

థగ్ లైఫ్ విజువల్ ఫీస్ట్ టీజర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

నవీన్ చంద్ర లెవెన్ చిత్రంలో శ్వేతా మోహన్ పాడిన లవ్లీ మెలోడీ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments