Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

Advertiesment
మైనర్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ టీన్ అకౌంట్!

ఠాగూర్

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:24 IST)
సోషల్ మీడియా ప్రభావం కారణంగా చిన్నారులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్‌ను తీసుకొచ్చేందుకు ముందుకు వచ్చింది. పిల్లలకు ఇన్‌స్టాను సురక్షిత వేదికగా మార్చేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లో మంగళవారం నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది. అంటే కొత్తగా ఇన్‌స్టాలో చేరే 18 ఏళ్లలోపు వారికి ఇకపై టీన్ అకౌంట్లను ఇస్తారు. ఇప్పటికే ఉన్న ఖాతాలను 60 రోజుల్లోగా టీన్ అకౌంట్లుగా మారుస్తారు. టీన్ అకౌంట్స్ పిల్లలకు సంబంధించిన భద్రతను మెరుగుపరచడంతో పాటు, పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ ఖాతాలు డిఫాల్ట్ ప్రైవేట్లో ఉంటాయని కంపెనీ తెలిపింది.
 
ఈ ఖాతాల ఉన్నవారు ఇప్పటికే ఫాలో/ కనెక్ట్ అయిన ఖాతాల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు. వారు మాత్రమే ట్యాగ్ చేయగలరు. అలాగే, సెన్సిటివ్ కంటెంట్‌పై పూర్తిగా నియంత్రణ ఉంటుంది. 16 ఏళ్లలోపు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీనివల్ల పిల్లలు వాడే ఇన్‌స్టా ఖాతాపై తల్లిదండ్రులు నిఘా సాధ్యమవుతుందని మెటా పేర్కొంది.
 
టీన్ అకౌంట్స్ అన్నీ డిఫాల్ట్ ప్రైవేటు అకౌంట్లుగా ఉంటాయి. దీంతో కొత్తగా ఎవరైనా మైనర్ల ఖాతాలను ఫాలో అవ్వాలనుకునేకుంటే.. ఆ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.
లేకపోతే వారి కంటెంట్‌ను చూడడం వీలుపడదు. ఫాలో అయ్యే వ్యక్తులు, కనెక్ట్ అయిన వ్యక్తుల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు. టీన్ ఖాతాలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది. కాబట్టి చూపించే ఫీడ్‌పై నియంత్రణ ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్‌లు, కామెంట్లలో అసభ్య పదజాలాన్ని ఇన్‌స్టా ఆటోమేటిక్‌గ్గా ఫిల్టర్ చేస్తుంది. రోజులో యాప్ వాడకం 60 నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్ వస్తుంది. 
 
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లేవీ రావు. పైగా డైరెక్ట్ మెసేజులకు ఆటో రిప్లయ్స్ వెళ్తాయి. పేరెంట్స్ కావాలంటే.. పిల్లల ఇన్‌స్టా సందేశాలను యాక్సెస్ చేయొచ్చు. రోజువారీ యూసేజ్‌ను కూడా తనిఖీ చేయొచ్చు. నిర్ణీత సమయంలో ఇన్‌స్టా వాడకుండా బ్లాక్ చేయొచ్చు. తొలుత యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో టీన్ అకౌంట్స్‌ను తీసుకొస్తున్నారు. జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా టీన్ అకౌంట్లు పూర్తిస్తాయిలో అందుబాటులోకి తెస్తామని మెటా వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)