Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుష్ప 2 నుంచి ఆసక్తికర పాయింట్ లీక్ - కేరళీయులకు ఓనమ్ శుభాకాంక్షలు అల్లు అర్జున్

Advertiesment
Pushpa 2 - Allu Arjun

డీవీ

, సోమవారం, 16 సెప్టెంబరు 2024 (10:47 IST)
Pushpa 2 - Allu Arjun
అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ వస్తూనే వుంది.  మరోవైపు ఇంకా షూటింగ్ చివరి దశలో వుంది. ఈ చిత్ర బిజినెస్ ఇంకా పూర్తికాలేదు. నేడు కేరళీయుల పండుగ అయిన ఓనమ్ శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
కాగా, ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి జాతరలో నీలం రంగుతో చీరతోకూడిన పంచె కట్టుకుని డాన్స్ వేసే సాంగ్ కూడా విడుదల విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఓ కథ బయట హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ముగింపులో అల్లు అర్జున్ చనిపోయాడో, కనపడకుండా పోయాడో అనే ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఓ అటవీ ప్రాంతంలో గాయాలతో గిరిజనులకు దొరడంతో వారి పూజించే అమ్మవారిని దగ్గర పెట్టి చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తోంది. ఆ సమయంలో ఓ సందర్భంలో ఓ పాటను తెరకెక్కించారట. అది కూడా కాంతార తరహాలో రిషబ్ శెట్టి చేసిన శైలిలో డ్రెస్ తో పాట వుంటుంది. ఇది సినిమాకు హైప్ చెప్పించేవిధంగా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అల్లు అర్జున్ ఫార్మెట్ లో దర్శకుడు సుకుమార్ ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేశాడని, ఆటవికుల ఆచారవ్యవహాలను బాగా స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషల్లో 6 డిసెంబర్ 2024న విడుదల కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్