Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్.బి.ఐలో ఉద్యోగ జాతర - 1511 పోస్టులకు నోటిఫికేషన్

sbi bank

ఠాగూర్

, మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (12:00 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకులో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1511 పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్.బి.ఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబరు 4, 2024 గా ఉంది. అభ్యర్థుల షార్టిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
 
పోస్టుల వివరాలు.. 
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, డెలివరీ - 187 ఖాళీలు డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్‌ఫ్రా సపోర్ట్, క్లౌడ్ ఆపరేషన్స్ - 412 ఖాళీలు డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - నెట్ వర్కింగ్ కార్యకలాపాలు - 80 ఖాళీలు డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఐటీ ఆర్కిటెక్ట్ - 27 ఖాళీలు
 
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 7 ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 784 ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 14 ఖాళీలు
 
డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి బీటెక్/బీఈ/ఎంసీఏ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తత్సమానమైన కోర్సులు చేసి ఉండాలి. వయో పరిమితి పరిమితి 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టుకు వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
 
దరఖాస్తు రుసుము జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.750గా ఉంది. 
ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
 
దరఖాస్తు చేయాలనుకునేవారు ఇటీవలి దిగిన ఫొటో, సంతకం, రెజ్యూమ్, గుర్తింపు ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ సర్టిఫికేట్, ప్రస్తుతం ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఫారం-16/ఆఫర్ లెటర్/పే స్లిప్లను దగ్గర ఉంచుకోవాలి. సర్టిఫికెట్లు అన్నింటినీ పీడీఎఫ్ ఫార్మాట్ లో సిద్ధంగా ఉంచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీల్స్ పిచ్చి.. అచ్చం శవంలా పడుకున్నాడు.. చిప్పకూడు తప్పలేదు (video)