Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్టు నెలలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష!!

Teacher

వరుణ్

, మంగళవారం, 2 జులై 2024 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆగస్టు నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. పేపర్-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్-1బీ ప్రత్యేక విద్య ఎస్జీటీ టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2బీ ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్ష విధానం తదితర వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. 
 
టెట్ దరఖాస్తు రుసుమును ఈ నెల 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణకు 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్నపత్రాలను అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 నుంచి హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక 'కీ'ని ఆగస్టు 10న, తుది కీని 25వ తేదీన విడుదల చేస్తారు. ఆగస్టు 30 టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం.. చంద్రబాబు లేఖ