Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో గ్రూపు-1 నోటిఫికేషన్ - వయోపరిమితి 44 నుంచి 46 యేళ్లకు పెంపు

Advertiesment
tspsc

వరుణ్

, మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (09:34 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 563 పోస్టులతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు కోసం వయసు మీరిన నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వయో పరిమితిని 44 యేళ్ళ నుంచి 46 యేళ్ళకు పెంచింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
మే లేదా జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునే సౌలభ్యం మార్చి 23వ తేదీ ఉదయం పది గంటల నుంచి మార్చి 27 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. హాల్ టిక్కెట్లను ఏడు రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
విమానంలో ప్రయాణికుడి అర్థనగ్న ప్రదర్శన... విమాన సిబ్బందిపైదాడి.. 
 
థాయ్ ఎయిర్ వేస్‌ విమానంలో బ్రిటన్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అర్థనగ్నంగా రచ్చరచ్చ చేశాడు. అతన్ని వారించబోయిన విమాన సిబ్బందిపై కూడా చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 
 
ఈ నెల 7వ తేదీన బ్యాంకాక్ నుంచి లండన్‌కు వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు తొలుత విమానం టాయ్‌లెట్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా పెద్ద పెట్టున అరుస్తూ బాత్రూమ్ తలుపులపై గట్టిగా చరిచి వాటిని విరగ్గొట్టాడు. అర్థనగ్న స్థితిలో నానా రభసా సృష్టించాడు. ఇదంతా చూసిన ఇతర ప్రయాణికులు అతడిని నిలువరించే ప్రయత్నం చేయగా, వారితో గొడవకు దిగాడు. 
 
ఈ క్రమంలోనే అక్కడికొచ్చిన క్రూ సిబ్బందిలో ఒకరిపై నిందితుడు చేయిచేసుకున్నాడు. అతడి ముష్టిఘాతాలకు బాధితుడి ముక్కు విరిగిపోయింది. ఈలోపు ఇతర ప్రయాణికులు అతడి చేతులు కట్టేసి సీటులో కూర్చోపెట్టారు. ప్రయాణం ముగిసే వరకూ పక్కనే ఉండి అతడు కదలకుండా నిలువరించారు. 
 
అయినా కూడా అతడు దుర్భాషలాడుతూ నానా రభస సృష్టించాడని ఇతర ప్రయాణికులు తెలిపారు. లండన్‌లోని హిత్రూ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి దిగినందుకు, విమానాన్ని ప్రమాదంలో పడేసినందుకు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవకాశాల పేరుతో అవసరాలు తీర్చుకున్నాడు.. యువతి ఫిర్యాదు...