సెంట్రల్ టీచర్స్ ఎలిజెబులిటీ టెస్ట్ (సీటెట్-2024) పరీక్ష తేదీ వచ్చేసింది. 2024 జనవరి 21న పరీక్ష జరగనుంది. ఈ దఫా సీటెట్ రాయాలని భావిస్తున్న వారు.. అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 23తో అప్లికేషన్ ప్రక్రియ గడువు ముగుస్తుంది.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	1-8 క్లాసులకు టీచర్‌గా ఉద్యోగం పొందాలంటే.. సీటెట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ సీటెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఎగ్జామ్, సిలబస్, భాషలు, ఎలిజెబులిటీ, ఎగ్జామ్ ఫీజు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలు సీటెట్ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది.