న్యూయార్క్‌లో కొత్తగా మరో 23 కరోనా నిర్ధారిత కేసులు నమోదైనాయి. కోవిడ్-19తో అమెరికా వణికిపోతోంది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ కయూమో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటికే వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటికే 19మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రావిన్స్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత కొన్ని రోజులుగా పెరుగుతున్నట్టు గవర్నర్ చెప్పారు. న్యూరోషెల్‌లో కొత్తగా 23 కేసులు నమోదు కాగా, వెస్ట్‌చెస్టర్‌లో కరోనా బాధితుల సంఖ్య 57కు పెరిగినట్టు చెప్పారు. రాక్‌అవే, సార్టోగా కౌంటీలలో కూడా కొత్త కేసులు నమోదైనట్టు వివరించారు.
ఇకపోతే.. కరోనా వైరస్ ఎఫెక్ట్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తాకింది. ట్రంప్ పాల్గొన్న ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దాంతో, శ్వేత సౌథం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అమెరికాలోని మేరీల్యాండ్‌లో గత నెల చివరి వారంలో ''ది కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్''ను నిర్వహించారు. అయితే, బాధిత వ్యక్తి ట్రంప్, పెన్స్‌ను కలువలేదని గుర్తించడంతో అధికారులు ఊపిరి పీల్చుచుకున్నారు.