గడ్డం పెంచిన పురుషులకే కరోనా వైరస్ సోకిందని తాజా అధ్యయనంలో తెలియవచ్చింది. గడ్డం కలిగిన పురుషులకే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. గత ఏడాది డిసెంబర్ ఆఖరిలో చైనాలో కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైంది. ఈ కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 2804 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మాత్రమే కాకుండా ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు కూడా కరోనా వ్యాప్తి చెందింది.
ఈ కరోనాను నియంత్రించేందుకు చైనా సర్కారుతో పాటు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే.. మాస్క్‌లు ధరించడంతో పాటు గుబురు గడ్డాలు, మీసాలు వుండకూడదని తాజా అధ్యయనం తేల్చింది. ఎందుకంటే.. గడ్డం పెంచిన పురుషులకే అత్యధికంగా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు వెల్లడైంది.
మాస్కులను దాటి కరోనా వైరస్ గడ్డం, మీసాలకు చేరుతున్నాయని తద్వారా ఈ వ్యాధి సులభంగా సోకుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుకే కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. పురుషులు క్లీన్ షేవ్ చేయాలని అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ తెలిపింది.