కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి

బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:47 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగుబండ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి, కొడుకుని కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. గంగుబండ తండాకు చెందిన వడిత్య రవి (29) మద్యానికి బానిసై ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. రోజు లాగానే ఈరోజు కూడా మద్యం మత్తులో ఉన్న రవి, తండ్రి మల్సూర్‌తో గొడవ పడటంతో తండ్రి మల్సూర్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు.
 
కొడుకుతో విసిగిపోయిన తండ్రి సిమెంట్ బిళ్ళతో రవి తలపై గట్టిగా మోదడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రవికి భార్య ఉంది. మద్యానికి బానిసైన రవి నుంచి భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన రవి తండ్రితో రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజస్థాన్ నదిలో పడిపోయిన బస్సు: 24 మంది మృతి