Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికతో లైంగిక సంబంధం.. భారతీయ విద్యార్థికి జైలు

Advertiesment
బాలికతో లైంగిక సంబంధం.. భారతీయ విద్యార్థికి జైలు
, శుక్రవారం, 6 మార్చి 2020 (13:42 IST)
అమెరికాలో వివిధ రకాల నేరాలకు పాల్పడేవారికి విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. తాజాగా చదువుకునేందుకు అమెరికాకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థికి ఏకంగా పదేళ్ళ జైలుశిక్షను కోర్టు విధించింది. ఇతను చేసిన నేరం ఏంటో తెలుసా? 11 యేళ్ల బాలికతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే. ఈ కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు 10 యేళ్ల జైలుశిక్షను విధించింది. 
 
భారత్‌కు చెందిన 23 యేళ్ళ సచిన్ భాస్కర్ అనే విద్యార్థి విద్యార్థి విసాపై అమెరికాకు వెళ్లాడు. అక్కడ, మైనర్ బాలికను లోబరుచుకున్నాడు. విద్యార్థిని లైంగికంగా ప్రలోభపెట్టే విధంగా ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపాడు. 
 
ఈ విషయం బహిర్గతం కావడంతో అతనిపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో 2018 ఆగస్టు 11న సదరు బాలికతో శారీరకంగా కలిశాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు సచిన్ భాస్కర్‌కు శిక్షను విధించింది. జూన్ 17 నుంచి ఈ శిక్ష అమల్లోకి రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పడక సుఖం కోరిన మామ.. ఆత్మహత్య చేసుకున్న కోడలు.. ఎక్కడ?